ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజిబీజీగా ఉన్నాడు డీఎస్‌పీ. దేవి మ్యూజిక్ అందించిన సరిలేరు నీకెవ్వరు సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో దేవి కంపోజ్ చేసిన మరో ఐటమ్ సాంగ్ ను షూట్ చేస్తున్నారట. తాను కంపోజ్ చేసిన మూడు వేర్వేరు పాటలను ఇవాళ ఒకే రోజు షూట్ చేస్తున్నారని దేవీ శ్రీ ప్రసాద్ వెల్లడించాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేశ్, తమన్నా మధ్య వచ్చే ఐటమ్‌సాంగ్‌తోపాటు వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంలో పాట, కీర్తి సురేశ్ నటిస్తోన్న గుడ్ లక్ సఖి చిత్రంలోని మరో పాటను షూట్ చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి సూర్యుడివో చంద్రుడివో పాట త్వరలోనే విడుదల కానుంది.
3 సినిమాలు..3 పాటలు..ఒకే రోజు షూటింగ్