మంత్రి కేటీఆర్ తో సౌదీ అరేబియా రాయబారి భేటీ

సౌదీ అరేబియా రాయబారి సౌద్ బిన్ మహ్మద్ అల్ సతీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. తెలంగాణ, సౌదీ అరేబియా మధ్య సంబంధాల బలోపేతం, రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడుల విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు (మైనార్టీ వ్యవహారాలు) ఏకే ఖాన్, ఐటీ ప్రిన్పిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.